రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పథకాన్ని కొందరు తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ నెల 26 నుంచి కొత్తగా 4 పథకాలను అమలు చేస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈలోపు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను గ్రామ, వార్డు సభల ద్వారా చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించింది.
కాగా, ప్రభుత్వ పథకాల పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నట్లు పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తానని చెప్పి తమ వద్ద డబ్బులు వసూలు చేశారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామసభ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట 500 మందికి పైగా గ్రామస్థుల నుండి అధికారులే డబ్బులు వసూలు చేశారని గ్రామస్తులు ఆరోపించారు.
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అధికారులు డబ్బులు వసూలు చేశారని గ్రామస్తుల ఆగ్రహం
రహదారిపై బైఠాయించి ఆందోళన
జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామ సభలో ఉద్రిక్తత
ఇందిరమ్మ ఇండ్ల పేరిట డబ్బులు వసూలు చేశారని ఆందోళన
గ్రామ సభలో అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు
ఇందిరమ్మ ఇండ్ల పేరిట 500… https://t.co/y4nDgneecR pic.twitter.com/YvtOGAXf70
— Telugu Scribe (@TeluguScribe) January 22, 2025