తెలంగాణలో నేటి తెల్లవారుజామున ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఆయన కూతురు ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. సోదాల అనంతరం ఐటీ అధికారులు దిల్ రాజు భార్యను బ్యాంకుకు తీసుకుని వెళ్లారు. అనంతరం బయటకు వచ్చిన దిల్ రాజు భార్య మాట్లాడుతూ..
బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి ఐటీ అధికారులు తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఐటీ సోదాలు అనేవి జనరల్‌గా జరిగేవి మాత్రమేనని స్పష్టంచేశారు. ఐటీ శాఖ అధికారులు బ్యాంక్ డీటెయిల్స్ కావాలని అడిగారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించామని దిల్ రాజు భార్య తేజస్విని బదులిచ్చారు. ఇదిలాఉండగా, సోదాల గురించిన సమాచారాన్ని ఐటీ అధికారులు ఇప్పటివరకు వెల్లడించకపోవడం గమనార్హం.