రాజమౌళి ఏం చేసినా అది బ్లాక్ బస్టరే..!

-

టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడు ఎవరు అంటే ముక్తకంఠంతో అందరు చెప్పే పేరు ఒకటే అదే ఎస్.ఎస్.ఆర్. స్టూడెంట్ నంబర్ 1 నుండి బాహుబలి కన్ క్లూజన్ వరకు సినిమా సినిమాకు ఆయన రేంజ్ పెంచుకోవడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. బాహుబలితో రాజమౌళి సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ఇదిలాఉంటే రాజమౌళి ఏం చేసినా అది బ్లాక్ బస్టర్ హిట్టే అని మరోసారి ప్రూవ్ అయ్యింది.

అదెలా అంటే తన కొడుకు పెళ్లి జైపూర్ లో పెట్టి అక్కడకు స్టార్స్ అందరిని రప్పించి వారితో ఆ పెళ్లి వేడుకను గ్రాండ్ సక్సెస్ అయ్యేలా చేశాడు. సిని తారల సందడితో కార్తికేయ, పూజా ప్రసాద్ ల పెళ్లి వేడుక ఓ అద్భుత దృశ్యంగా మారింది. అయితే స్టార్స్ అందరి ఎంట్రీలో రాజమౌళి బాధ్యత ఉందట. తప్పకుండా అటెండ్ అవ్వాలని చెప్పారట. స్టార్స్ లో మహేష్, అల్లు అర్జున్ తప్ప ప్రభాస్, ఎన్.టి.ఆర్, రాం చరణ్, రానా, నాగార్జున, అఖిల్, నాని ఇలా అందరు వెడ్డింగ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.

రాజమౌళి ప్లాన్ అంటే అంతే మరి ఏం చేసినా పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టే.. ఆయన అలా సక్సెస్ మేనియా కొనసాగిస్తున్నారు. పెళ్లి వేడుకలో స్టార్ హంగామా ఎలా ఉందో కింద వీడియోలో చూడండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version