కీరవాణికి పద్మశ్రీ.. కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా అంటూ రాజమౌళి పోస్ట్..!

-

తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడిగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎం.ఎం.కీరవాణి గురించి ఆయన సంగీత సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను తన మ్యూజిక్ తో మైమరపింప చేస్తున్న ఈయన ప్రతభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇదివరకే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ పాటలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే .అంతే కాదు ఈ పాట ఆస్కార్ బరిలో కూడా నిలిచింది.

ఇప్పుడు మరొకసారి కీరవాణికి భారత అత్యున్నత గౌరవప్రదమైన పద్మశ్రీ పురస్కారం లభించడంతో తన పెద్దన్నయ్యకు ఈ అవార్డు వచ్చిందని తెలిసి రాజమౌళి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రాజమౌళి.” నిజానికి ఈ గుర్తింపు ఎప్పుడో వచ్చి ఉండాల్సిందని.. నేను మీ అభిమానుల లాగే అనుకుంటున్నాను.. అయితే మీరే చెప్పారు ఒకసారి.. ఒక వ్యక్తి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఈ విశ్వం ఊహించని రీతిలో ఇస్తుందని.. ఇక నేనే గనుక విశ్వంతో మాట్లాడితే.. అవార్డుకు అవార్డుకు కొంచెం గ్యాప్ ఇవ్వమని చెబుతాను.. ఎందుకంటే ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక ఇంకోటి ఇవ్వు “అని అంటూ రాసుకు వచ్చారు రాజమౌళి.

ఇకపోతే రాజమౌళి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. పద్మశ్రీ రావడంతో రాజమౌళి ఉబ్బితబ్బిబవుతున్నారు. మరోపక్క కీరవాణి కూడా తన తల్లిదండ్రులకు, గురువులకు సదా రుణపడి ఉంటాను అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version