కాటేరమ్మ కొడుకు క్లాసెన్ రిటైర్మెంట్

-

క్రికెట్ అభిమానులకు హెన్రిచ్ క్లాసెన్ చేదు వార్త అందజేశారు. తాను అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. సౌత్ ఆఫ్రికా స్టార్ క్రికెటర్, విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి అందరికీ షాక్ ఇచ్చారు. అతి తక్కువ వయసులోనే హెన్రిచ్ క్లాసెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం 33 ఏళ్ల వయసులోనే క్రికెట్ కు వీడ్కోలు పలికారు.

KLASSEN ANNOUNCED HIS RETIREMENT FROM INTERNATIONAL CRICKET
KLASSEN ANNOUNCED HIS RETIREMENT FROM INTERNATIONAL CRICKET

దక్షిణాఫ్రికా తరపున 60 వన్డేలు, 58 టీ20లు ఆడారు. 4 టెస్టులు ఆడగా… 4 వన్డే సెంచరీలతో సహా అన్ని ఫార్మాట్లలో కలిపి 3245 పరుగులు సాధించాడు. కాగా, క్లాసెన్ ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. హెన్రిచ్ క్లాసెన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో తన అభిమానులు నిరాశలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news