హైదరాబాద్ నగరాన్ని చూస్తుంటే.. అమెరికాలోని న్యూయార్క్ సిటీని చూసినట్లే ఉందని సూపర్ స్టార్ రజినీకాంత్ పేర్కొన్నారు. 22 సంవత్సరాల తర్వాత మొన్న సినిమా కోసం హైదరాబాద్ వచ్చానని.. ఆ సమయంలో హైదరాబాద్ అభివృద్ధి చూసి షాక్ అయ్యానని వెల్లడించారు. చంద్రబాబును ఆప్తమిత్రుడుగా అభివర్ణించిన రజనీకాంత్…బాలయ్యను తమ్ముడిగా పేర్కొన్నారు.తెలుగు మాట్లాడి చాలా రోజులైంది…తెలుగులో ఏమైనా తప్పులుంటే క్షమించాలని కోరారు.
ఈ సభలో జనాన్ని చూస్తుంటే రాజకీయం మాట్లాడాలని అనిపిస్తోంది…కానీ అనుభవం వద్దురా రజనీ రాజకీయం మాట్లాడొద్దంటోందన్నారు. కానీ ఎన్టీఆర్ గురించి రాజకీయం మాట్లాడక తప్పడం లేదు…నాకు చంద్రబాబును మోహన్ బాబు పరిచయం చేశారని తెలిపారు. గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడు.చంద్రబాబు పెద్ద విజనరీ.. చంద్రబాబు విలువ ఇక్కడ ఉన్నవాళ్లకంటే…బయట ఉన్న వాళ్లకే తెలుసు అన్నారు.ఎప్పుడూ అభివృద్ధి గురించే చంద్రబాబు మాట్లాడేవారు.హైదరాబాదులో సైబరాబాద్ సైడ్ వెళ్లాను.. ఇండియాలో ఉన్నానా..? హైదరాబాదులో ఉన్నానా అని అనిపించిందన్నారు.