మామా అల్లుళ్ల క్రిస్ మస్ వేడుక..!

-

సూపర్ స్టార్ రజినికాంత్, కోలీవుడ్ స్టార్ ధనుష్ కలిసి క్రిస్ మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం రజిని అండ్ ఫ్యామిలీ అమెరికా ట్రిప్ లో ఉన్నారు. అక్కడే క్రిస్ మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. రజిని అల్లుడు ధనుష్ తో కలిసి దిగిన పిక్స్ తమిళ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. రజిని అల్లుడిగా కాకుండా ధనుష్ సొంత టాలెంట్ తో క్రేజ్ సంపాదించాడు.

ఈమధ్యనే ధనుష్ నటించిన మారి-2 రిలీజైంది. తమిళనాడులో ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. మారి సినిమా సీక్వల్ గా వచ్చిన ఈ సినిమాలో మాస్ లుక్ లో ధనుష్ అలరించాడు. ఇక సూపర్ స్టార్ రజినికాంత్ కూడా 2.ఓతో సెన్సేషన్స్ క్రియేట్ చేశాడు. శంకర్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.

రజిని, ధనుష్ దిగిన పిక్ ను ధనుష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి హ్యాపీ హాలీడేస్ అని ట్వీట్ చేశాడు. ఈ పిక్ ప్రస్తుతం కోలీవుడ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version