రాం చరణ్ ‘వినయ విధేయ రామ’ ఆడియో రివ్యూ

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం తర్వాత చేస్తున్న సినిమా వినయ విధేయ రామ. బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కొద్ది గంటల్లో మొదలవుతుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

ఈ సినిమాలో మొత్తం 5 సాంగ్స్ ఉన్నాయని తెలుస్తుంది. తందానే తందానే, తసాదియ్యా, ఏక్ బార్, రామ లవ్స్ సీత, అమ్మా నాన్న.. ఇలా ఐదు సాంగ్స్ ఐదు డిఫరెంట్ గా ఉన్నాయి. అయితే ఈ సాంగ్స్ ఎలా ఉన్నాయి వాటి సాహిత్య ఎవరు అదించారు.. సాంగ్స్ పాడింది ఎవరో చూస్తే..

తందానే తందానే : సినిమాలో ఫ్యామిలీ సాంగ్ గా అనిపిస్తున్న ఈ పాటని ఎం.ఎల్.ఆర్ కార్తికేయన్ పాడటం జరిగింది. శ్రీమణి ఈ సాంగ్ సాహిత్యం అందించారు. దేవి మార్క్ ఫ్యామిలీ సాంగ్ గా ఇది వచ్చింది.

తస్సాదియ్యా : జాస్మిత్ జాస్జ్, మానసి పాడిన ఈ సాంగ్ కూడా శ్రీమణి రాయడం జరిగింది. డ్యూయెట్ సాంగ్ గా వచ్చిన ఈ పాట రాం చరణ్ డ్యాన్స్ నంబర్ గా చెప్పుకోవచ్చు.

ఏక్ బార్ : డిఎస్పి, రవీనా రెడ్డి పాడిన ఈ పాట క్యాచీగా ఉంది. ఈ సాంగ్ లో కూడా రాం చరన్ డ్యాన్స్ అదరగొట్టేలా కనిపిస్తుంది. స్పెషల్ సాంగ్ గా వస్తున్న ఈ పాటలో బాలీవుడ్ హాట్ బేబీ ఈషా గుప్త నర్తించింది.

రామ లవ్స్ సీత : సింహా, ప్రియా హేమేష్ పాడిన ఈ పాట రెగ్యులర్ దేవి మార్క్ సాంగ్ గా వచ్చింది. వినగానే నచ్చే పాటగా రామా లవ్స్ సీత సాంగ్ ఉంది. శ్రీమణి ఈ పాటకు సాహిత్యం అందించారు. చరణ్, కియరాల మధ్య అందంగా ఈ సాంగ్ చిత్రీకరించారని అనిపిస్తుంది.

అమ్మా.. నాన్న : కాల భైరవ పాడిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఆల్బం లో ఈ ఒక్క సాంగ్ శస్త్రి గారు రాశారు. సినిమాలో ఇదో ఎమోషనల్ సాంగ్ గా అనిపిస్తుంది.

మొత్తానికి దేవి మార్క్ ఆల్బం తో వచ్చిన వినయ విధేయ రామ ఆడియో సూపర్ హిట్ అని చెప్పొచ్చు. అయితే కొత్తగా ప్రయత్నం చేయలేదని మాత్రం అనిపిస్తుంది. దేవి రెగ్యులర్ సినిమాల మ్యూజిక్ లానే ఇది అలరిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version