ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాత్సవ కన్నుమూత

-

ప్రముఖ బాలీవుడ్ కమెడియన్​ రాజు శ్రీవాస్తవ కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు. అయితే గత నెల 10న గుండెనొప్పితో దిల్లీలోని ఎయిమ్స్​ ఆస్పత్రిలో చేరారు. ఈ రోజు ఆస్పత్రిలో ఆరోగ్య పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

రాజు శ్రీవాస్తవ మరణంతో బాలీవుడ్​లో విషాదం అలుముకుంది. రాజు కుటుంబానికి బాలీవుడ్ సెలబ్రిటీలు సానుభూతి తెలుపుతున్నారు. రాజు శ్రీవాత్సవ మరణం బాలీవుడ్ కామెడీకి తీరని లోటని పలువురు కమెడియన్లు అభిప్రాయపడ్డారు. ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో #RIPComedyKing, #RIPRajuSrivastav అనే హాష్ ట్యాగ్​లతో ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. వి మిస్ యూ రాజు భాయ్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version