ప్రముఖ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ మాస్టర్ ఇటీవలే 53 సంవత్సరాలు వయసులో అనారోగ్య సమస్యల కారణంగా తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మరణం తర్వాత కూడా రాకేష్ మాస్టర్ పేరుతో పలు వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా తాజాగా రాకేష్ మాస్టర్ మూడో భార్యగా చెప్పుకుంటున్న లక్ష్మీపై పలువురు మహిళలు దాడి చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాదులోని పంజాగుట్ట ఏరియాలో ఒకేసారి ఐదుగురు మహిళలు వచ్చి ఆమెపై దాడి చేశారు. లక్ష్మీ స్కూటర్ పై వెళ్తూ ఉండగా.. లల్లీ అనే ఒక యూట్యూబర్ మరో నలుగురు మహిళలతో వచ్చి దాడి చేసి నడిరోడ్డుపై ఇష్టం వచ్చినట్టు ఆమెను జుట్టు పట్టుకొని విచక్షణారహితంగా కొట్టారు.
ఇక పోలీసులకు అక్కడి స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని ఆపై లక్ష్మిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అంతేకాదు రాకేష్ మాస్టర్ భార్యపై దాడి చేసిన మహిళలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయగా.. మొదట లక్ష్మీనే తమను దూషించింది అని వారు పలు ఆధారాలతో ఆమెపై తిరిగి కేసు పెట్టారు. ఇద్దరి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు విచారించి వారిని పంపించేశారు. లక్ష్మీ తోపాటు ఆమెను కొట్టడానికి వచ్చిన ఐదు మంది మహిళలు కూడా యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారు. ఇదే విషయంపై వీరి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళితే తనను నెల్లూరుకు చెందిన భారతి అనే మహిళ రెండు నెలలుగా చంపేస్తామని బెదిరిస్తోందని.. వీరందరికీ లక్ష రూపాయలు సుఫారీ కూడా ఇచ్చిందని తెలిపింది. అయితే దీనిపై లల్లీ కూడా స్పందిస్తూ.. ఆమెతో ముందుగా తనకు ఎలాంటి గొడవలు లేవని.. కానీ తన కూతుర్ని ఉద్దేశిస్తూ పలుమార్లు యూట్యూబ్లో అసహ్యంగా మాట్లాడుతూ.. బూతులు తిట్టడం వల్లే లక్ష్మీని కొట్టానని చెప్పింది. మరోవైపు రాకేష్ మాస్టర్ కుటుంబ సభ్యులు కూడా ఆమెపై దాడి చేస్తున్నట్లు లక్ష్మి వెల్లడించింది.