ఐప్యాక్‌తో జగన్ అలా..కానీ ఎమ్మెల్యేలు రివర్స్.!

-

జగన్ ఏ పనిచేసిన ఐప్యాక్ చెప్పిందే చేస్తున్నారు..వారు ఇచ్చే రిపోర్టుల బట్టే ముందుకెళుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆఖరికి ఎక్కడైనా రోడ్డు వేయాలన్న ఐప్యాక్ చెబితేనే వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జగన్ సొంత పార్టీ నేతల కంటే…ఐప్యాక్ వాళ్ళనే ఎక్కువ నమ్ముతున్నారట. ఇంకా వారు ఏది చెబితే అదే అన్నట్లు ఉన్నారు. ఇక ప్రతి సారి ఎమ్మెల్యేల పనితీరుపై ఐప్యాక్ సర్వే చేసి జగన్‌కు రిపోర్టులు ఇస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా కూడా ఎమ్మెల్యేల పనితీరు తెలుసుకునేందుకు ఐప్యాక్ టీమ్ తో జగన్ భేటీ అయ్యారు. మొత్తం వివరాలని తెలుసుకున్నారు. ఏ ఎమ్మెల్యే పనితీరు బాగుందో..బాగోలేదో తెలుసుకున్నారు. ఇలా ప్రతి విషయం గురించి ఆయన తెలుసుకుని…రానున్న రోజుల్లో మరొకసారి ఎమ్మెల్యేలకు క్లాస్ ఇవ్వనున్నారు. దీంతో ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. అదే సమయంలో ఐప్యాక్ టీం పై కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారట. కేవలం తమపై దృష్టి పెట్టడం కాదని, ప్రభుత్వ పరమైన అంశాలు చూడాలని, అసలు సంక్షేమ పథకాలు ఇస్తున్న ఎందుకు వ్యతిరేకత ఉందనేది తెలుసుకోవాలని అంటున్నారట.

అందుకే ఎమ్మెల్యేలు కూడా తాము సొంతంగా సర్వేలు చేయించుకున్నట్లు సమాచారం.  ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంతో గ్రామాలకు వెళ్లినప్పుడు రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సమస్యలు, అభివృద్ధిపై జనం నిలదీస్తున్నారు. వీటికి సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారని తెలిసింది.

అలాగే ఆస్తి పన్ను పెంపు నుంచి చెత్త పన్ను వరకు.. కరెంటు చార్జీల నుంచి బస్సు చార్జీల వరకు బాదుడు.. ఇలా ప్రతిదీ ధర పెరిగిపోవడంపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలని అంటున్నారు. అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు ఇవన్నీ కీలకం కానున్నాయి. కాబట్టి తమ పనితీరే కాదు..మిగతా వాటిపై కూడా ఐప్యాక్ ఫోకస్ పెట్టాలని ఎమ్మెల్యేలు లోలోపల చర్చికుంటున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news