మరో కన్నడ హీరోపై కేసు నమోదు

-

Rakshit Shetty: ప్రముఖ హీరో రక్షిత్‌ శెట్టికి ఊహించని షాక్‌ తగిలింది. కన్నడ నటుడు, నిర్మాత రక్షిత్‌ శెట్టిపై కేసు నమోదైంది. ‘బ్యాచిలర్‌ పార్టీ’ సినిమా కోసం రక్షిత్‌ తమ పాటలను కాపీ కొట్టారని ఎంఆర్‌టీ మ్యూజిక్‌ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘న్యాయ ఎల్లిదే’, ‘గాలిమాతు’ సినిమాల్లోని పాటలను రక్షిత్, ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోస్ ‘బ్యాచిలర్‌ పార్టీ’లో కాపీ కొట్టారని పేర్కొంది.

Rakshit Shetty Of Paramvah Studios Faces Copyright Infringement Charges Over Two Songs Used

ఈ విషయంపై స్పందించాలని పోలీసులు రక్షిత్‌కు నోటీసులు జారీ చేశారు. కాగా, అభిమానిని చిత్రహింసలు పెట్టి చంపిన కన్నడ హీరో దర్శన్…ప్రియురాలు పవిత్రా గౌడకు అసభ్యకర మెసేజ్‌లు చేశాడని అభిమాని రేణుకా స్వామికి చిత్రహింసలు పెట్టి చంపాడట. రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి కరెంట్ షాక్ ఇచ్చి, తాను శాకాహారినని చెప్పినా వినకుండా బిర్యానీతోపాటు ఎముకను నోట్లో కుక్కి తినిపించి చిత్రహింసలకు గురి చేశాడట దర్శన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version