ప్రముఖ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఆమె గ్లామర్ షో గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పాలి. ఎందుకంటే ఒకసారి బికినీలో అందరినీ ఆకట్టుకునే ఈమె మరొకసారి చీరకట్టులో సాంప్రదాయంగా కనిపించి మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. మొన్నటి వరకు బికినీ దుస్తులతో యువతకు చెమటలు పట్టించిన ఈమె తాజాగా చీర కట్టులో చందమామలా కనిపించి.. అందరిని ఒక్కసారిగా తన వైపు తిప్పుకుంది. తాజాగా లైట్ బ్లూ కలర్ సారీ ధరించి సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ.
ఇకపోతే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ మొన్నటి వరకు బాలీవుడ్ లో భారీ అవకాశాలు అందుకుంది. ఒకే ఏడాది ఏకంగా ఐదు చిత్రాలతో ప్రేక్షకులను అదరించిన ఈమె అక్కడ సెన్సేషన్ గా మారింది. ఇకపోతే ఈ చిత్రాలన్నీ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
తాజాగా లైట్ బ్లూ కలర్ చంకీల అద్దాలతో కూడిన చీర కట్టుకొని స్లీవ్ లెస్ బ్లౌస్ తో తన అందాలను మరింతగా బయటపెట్టేస్తోంది. పాక్షికంగా కనిపించే నడుము అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.