చరణ్ కు హ్యాండ్ ఇచ్చిన రకుల్

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమాకు వినయ విధేయ రామా అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట. ఈ స్పెషల్ సాంగ్ కోసం టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ను అడిగారని తెలుస్తుంది.

ఇప్పటికే చరణ్ తో బ్రూస్ లీ, ధ్రువ సినిమాల్లో నటించిన రకుల్ రాబోయే సినిమాలో ఐటం సాంగ్ కు నో చెప్పిందట. అసలే అవకాశాలు రావడం లేదని బాధపడుతున్న అమ్మడు వచ్చిన ఈ అవకాశాన్ని ఎంచక్కా వాడుకోవచ్చు కాని రకుల్ మాత్రం ఈ ఆఫర్ తిరస్కరించిందట. ఒక్కసారి ఐటం సాంగ్ చేస్తే ఇక అదే అందరు అడుగుతారని రకుల్ ఆలోచన.

ఎన్.టి.ఆర్ కోసం కాజల్ ఐటం గాళ్ గా మారినా అది ఆమె కెరియర్ కు ప్లస్ అయ్యిందే తప్ప ఏమి కాలేదు. మరి రకుల్ ఎందుకు ఈ ఛాన్స్ వదులుకుందో ఆమెకే తెలియాలి. ఇక ప్రస్తుతం రకుల్ కాదన్న ఆ స్పెషల్ సాంగ్ కోసం ప్రభాస్ సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. శ్రద్ధా అయినా సరే ఓకే అంటుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version