మెగాస్టార్ ఎంట్రీతో ర‌కుల్ అల‌క‌…

317

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మేనేజర్ల రజతోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. గ‌తంలో ఎప్పుడూ లేనంత‌గా ఈ కార్య‌క్ర‌మం చాలా గ్రాండ్‌గా జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి నుంచి ప‌లువురు ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మానికి రావ‌డంతో చాలా స‌క్సెస్ అయ్యింది. ఈ కీల‌క కార్య‌క్ర‌మంలో క్రేజీ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్ అలిగిన‌ట్టు తెలుస్తోంది.

ఈ కార్య‌క్ర‌మంలో చాలా మంది స్టార్లు సైతం లైవ్ ప్రోగ్రామ్‌లో త‌మ పెర్పామెన్స్‌తో ఆక‌ట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే స్టార్ హీరోయిన్‌గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓ నాట్య ప్రదర్శన ఇచ్చేందుకు కమిట్ అయ్యింది. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ప్రదర్శన తర్వాత రకుల్ ప్రీత్ పెర్ఫార్మెన్స్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి రావడంతో హడావుడి మొదలైంది.


చిరు రావ‌డంతో వెంట‌నే ప్రోగ్రామ్స్ కాసేపు ప‌క్క‌కు వెళ్లిపోయాయి. ఆ వెంటనే ప్రముఖుల స్పీచ్‌ల కార్యక్రమం మొదలైంది. నిర్వాహ‌కులు చిరును స్టేజ్‌మీద‌కు ఆహ్వానించారు. వెంట‌నే చిరు స్పీచ్ మొద‌లైంది. ఆ హ‌డావిడిలో ర‌కుల్‌ను ప‌ట్టించుకున్న వారే లేరు. దీంతో ర‌కుల్ ఎంతో క‌ష్ట‌ప‌డి లైవ్ పెర్పామెన్స్ ఇవ్వాల‌న్న ఆశ‌తో వ‌స్తే… రకుల్ ప్రదర్శన సాధ్యం కాలేదు. దీంతో రకుల్ అలిగి ఆ కార్యక్రమం నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం.