దేవాదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉంది. దాని వల్ల అడ్మినిస్ట్రేషన్ కు ఇబ్బంది అవుతుంది అని మంత్రి కొండా సురేఖ అన్నారు. రెవెన్యూ నుంచి ఉద్యోగులను తీసుకోవడం ఇప్పుడు కొత్తేమీ కాదు. లీగల్ లిటికేషన్స్ లేని వాటిని మొదటి దశలో సర్వే చేయాలని అదేశించాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడ కుంబాబిషేకాలు చేయాలో లిస్ట్ తియ్యాలని ఆదేశాలు ఇచ్చాం. కాళేశ్వరంలో కుంభాభిషేకం చేయక 42 ఏళ్లు అవుతుంది అని మంత్రి తెలిపారు.
అలాగే ఫారెస్ట్ లో సర్వేయర్ల ప్రొటెక్షన్ పై ఎలాంటి ఫిర్యాదులు లేవు. గత పదేళ్ళలో దేవాదాయ శాఖ భూములు కబ్జా అయ్యాయి. గత ప్రభుత్వంలో నాయకులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం ఉంది. అదే విధంగా ఈటల రాజేందర్ పై త్వరలోనే విచారణ జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ల సర్వేతో మాకు పేరు వస్తదనే BRS విమర్శలు చేస్తుంది. బిసి రిజర్వేషన్ల వ్యాల్యూ ఇప్పుడే అర్థం కాదు. ఉద్యోగాలు, ఇతర అంశాల్లో బీసీలకు న్యాయం జరుగుతుంది అని కొండా సురేఖ అన్నారు.