వీడియో : చిన్నప్పటి ఆటలు ఆడుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్…!

-

లాక్ డౌన్ సమయంలో ఎవరికి వారు తమ చిన్న నాటి సంఘటనలను గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ జ్ఞాపకాలకు సంబంధించిన వీడియో లను షేర్ చేస్తున్నారు. సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు అందరూ కూడా సోషల్ మీడియాలో ఈ వీడియో లను షేర్ చేస్తున్నారు. తమ చిన్న తనంలో జరిగిన జ్ఞాపకాలను అన్నీ కూడా పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన సోదరుడి తో చిన్నప్పుడుఏ ఆటలు అయితే ఆడుకుందో దానికి సంబంధించి వీడియో ని పోస్ట్ చేసింది. ఈ వీడియో లో ఆమె సరదాగా తన సోదరుడి తో కలిసి కబడ్డీ ఆడుకుంటూ ఉంటుంది. ఈ సందర్భంగా ఇద్దరూ కూడా సరదాగా కొట్టుకుంటూ ఉంటారు. కబడ్డీ ఆడిన సమయంలో తన సోదరుడి మీద ఆమె గెలుస్తుంది.

తను విజయం సాధించినట్టు సెలబ్రేట్ చేసుకుంటుంది. అలాగే మరికొన్ని ఆటలు కూడా ఆడుకుంటుంది. ఈ వీడియో ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో లో ఆమె కాస్త పొట్టి దుస్తులు ధరించడం తో హాట్ గా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news