మేనకోడలుకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన రామ్ చరణ్..!

-

మెగా హీరో వారసుడు రామ్ చరణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఇటీవల ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. ఇక ఆయన తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ క్రమంలోని తాజాగా తన తదుపరి చిత్రం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకి ఇది 15వ చిత్రమే కావడం గమనార్హం.

సినిమా షూటింగ్ లతో ఎంతో బిజీగా గడిపే రామ్ చరణ్ కొంచెం సమయం దొరికితే చాలు తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ క్రమంలోని రామ్ చరణ్ షూటింగ్లో కాస్త బ్రేక్ దొరకడంతో అక్క సుస్మిత , చెల్లి శ్రీజ తో కలిసి వీకెండ్ ట్రిప్పు ప్లాన్ చేశారు. సిస్టర్స్ , ఫ్రెండ్స్ తో కలిసి సొంత ఫ్లైట్లో విదేశాలకు వెళ్లి బాగా ఎంజాయ్ చేసి వచ్చారు. అంతేకాదు ఆ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ట్రిప్ పూర్తయిన వెంటనే రామ్ చరణ్ శ్రీజ పెద్ద కుమార్తె నివృత్తికి చిన్న సర్ప్రైజ్ ఇచ్చి ఆమెను ఆశ్చర్యపరిచాడు.

ఇక శ్రీజ పెద్ద కుమార్తెను నివృత్తి ప్రస్తుతం ముంబైలో చదువుకుంటుంది. ఇక ఈ క్రమంలోనే అమ్మాయికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏకంగా తాను చదువుకుంటున్న స్కూల్ కి వెళ్లి అక్కడ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక అక్కడే నివృత్తి స్నేహితులతో పాటు విద్యార్థులని అలాగే స్కూల్ యాజమాన్యంతో కూడా కాసేపు సరదాగా ముచ్చటించారు చరణ్.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ గా మారుతున్నాయి. ఒక్కసారిగా మామయ్య తన స్కూల్లో ప్రత్యక్షమవడంతో నివృత్తి సంతోషంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version