డిప్రెషన్ లో రామ్ చరణ్..!

-

ఆర్ఆర్ఆర్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు రామ్ చరణ్.. ఎప్పుడో 13 ఏళ్ల క్రితం వచ్చిన మగధీర చిత్రం తోనే విపరీతమైన క్రేజ్ సంపాదించేసిన చెర్రీ.. ప్రస్తుతం ఈ సినిమా హిట్ తో అంతర్జాతీయంగా ఇంకోసారి తానేంటో నిరూపించుకున్నాడు. అయితే వరుస హిట్లొస్తున్నప్పటికీ కొన్ని విషయాలతో రామ్ చరణ్ డిప్రెషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది..

ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆర్సి15 వర్కింగ్ టైటిల్ నడుస్తోంది. ఎన్నోసార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎట్టకేలకు షెడ్యూల్ ను కన్ఫర్మ్ అయ్యి ప్రస్తుతం న్యూజిలాండ్ లో షూటింగ్ జరుపుకుంటుంది.. అయితే శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు చరణ్ అభిమానులు.. అంతేకాకుండా ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉండనున్నట్టు తెలుస్తోంది. వీటన్నిటికీ తగినట్టు చరణ్ తన ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం.. అయితే ఎప్పుడో షూటింగ్ ప్రారంభమైన ఇప్పటికీ చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో చరణ్ కొంచెం నిరాశ చెందినట్టే తెలుస్తోంది.

అలాగే శంకర్ ఇండియన్ టు చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్సి15 మరింత లేట్ అవుతూ వస్తుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదల అవ్వాల్సి ఉన్నప్పటికీ ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో చరణ్ అభిమానులు కొంత అప్సెట్ అయ్యరు.. అయితే దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ ప్రాజెక్ట్ చేయవలసి ఉండగా దాన్ని కేన్సిల్ చేసుకున్నా.. ఆ తర్వాత తన ముందున్న ప్రాజెక్ట్లను ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రశాంతనీల్, కొరటాల శివతోనూ చిత్రాలు చేయడానికి సిద్ధమవుతున్నారు చరణ్.. ఇదే సమయంలో పర్సనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్న.. ఈ విషయాలన్నీ గందరగోళంగా అనిపించి ఈ మధ్యకాలంలో కాస్త డిప్రెషన్ కు వెళ్ళినట్టు తెలుస్తోంది.. అందుకే ప్రతిసారి వెకేషన్స్ కు వెళ్తూ రిలీఫ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం..
.

Read more RELATED
Recommended to you

Exit mobile version