బాహుబలి క్రేజ్ రాజమౌళి, ప్రభాస్ కే! మిగిలిన వారికి.?

-

బాహుబలి1,2′ సినిమాలు ప్రభాస్ కి భారీ క్రేజ్ తో  పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక రాజమౌళి అయితే టాప్ మోస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక దాని తర్వాత ఆర్ ఆర్ ఆర్ మూవీ తో బాహుబలి విజయం గాలివాటం కాదని నిరూపించాడు. ఇక తాను మహేశ్ తో పాన్ వరల్డ్ సినిమా టార్గెట్ పెట్టుకున్నాడు. బాహుబలి సినిమా తో ప్రభాస్ కాకుండా నటించిన మిగిలిన వారికి ఏ మాత్రం క్రేజ్ రాలేదు.

ప్రభాస్  బాహుబలి తర్వాత ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఇండియాలోనే నెంబర్ వన్ దిశగా దూసుకుపోతున్నాడు. అయితే శివగామిగా విశ్వరూపం చూపించిన రమ్యకృష్ణ.. కొన్ని షోస్ లో మాత్రమే కనపడుతోంది. బాహుబలితో ప్రభాస్ తో సమానంగా రానా దగ్గుబాటి కూడా పాన్ ఇండియా స్టార్ గా  క్రేజ్ వచ్చినా తర్వాత వచ్చిన సినిమాలు సరిగా ఆడలేదు.

బాహుబలి 2′ తర్వాత అనుష్క కు ‘భాగమతి’ వంటి హిట్ వచ్చింది. కానీ తర్వాత మంచి హిట్ లేకుండా పోయింది. మిల్కీ బ్యూటీ తమన్నా కొన్ని సినిమాలు చేసింది కాని పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక మన కట్టప్ప కూడా పెద్ద ఎత్తున అవకాశాలు రాలేదు.దీనిని బట్టి ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ ఏ ఒక్క స్టార్ కు కూడా ఉపయోగపడినట్లు అనిపించడంలేదు. ఇది చాలా విచిత్రం గా వుంది గురూ.

Read more RELATED
Recommended to you

Exit mobile version