యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న రామ్ చరణ్..ఎలా అంటే..?

-

ఆస్కార్ విన్నింగ్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యువి క్రియేషన్స్ లోని తన స్నేహితుడు విక్రమ్ రెడ్డితో తాజాగా యంగ్ టాలెంట్ వాళ్లకోసం ఆయన చేతులు కలిపారు.కొత్త కాన్సెప్ట్ చిత్రాలను యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడానికి ఇప్పుడు వీరిద్దరూ “వి మెగా పిక్చర్స్ ” బ్యానర్ ను ప్రారంభించారు. ఇకపోతే పాన్ ఇండియా ప్రేక్షకులు మెచ్చేల విలక్షణమైన చిత్రాలను ఈ సంస్థ రూపొందించడానికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసే వేదికగా కూడా మారబోతోంది.

ఇకపోతే ఈ నిర్మాణ సంస్థ వి మెగా పిక్చర్స్ బ్యానర్లో విలక్షణమైన కథాంశాలతో పాటు తిరుగులేని వినోదాన్ని ప్రేక్షకులకు అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇక సినీ నిర్మాణంలో అసాధారణమైన ఆసక్తితో పాటు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందించాలని ఆలోచన ఉన్న టీం ఆధ్వర్యంలో ఈ సంస్థ ముందుకు సాగబోతోందని.. సినీ పరిశ్రమలో ఎవరు గుర్తించని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యం అంటూ రాంచరణ్ కూడా స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. మా వి మెగా పిక్చర్స్ బ్యానర్ ను విలక్షణమైన ఆలోచనలను ఆవిష్కరిస్తూ వైవిధ్యమైన సరికొత్త వాతావరణాన్ని పెంపొందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అభివృద్ధి చెందుతున్న టాలెంట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసి ఒక సరికొత్త ప్రభావాన్ని చూపడమే లక్ష్యంగా పెట్టుకున్నాము అంటూ తెలిపారు. ఇక విక్రం మాట్లాడుతూ.. ఈ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఎంతో ప్రతిభ ఉన్న నటీనటులు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులతో కలిసి వీ మెగా పిక్చర్స్ పనిచేయనుంది అంటూ UV క్రియేషన్స్ విక్రమ్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version