చెర్రీ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్.. RC16 పోస్టర్ రిలీజ్

-

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రామ్ చరణ్ బ్యాక్ నుంచి కనిపిస్తూ.. చేతిలో సిగార్ తో మాస్ లుక్ లో కనిపించాడు.

మార్చి 27 గురువారం చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు ముందే మేకర్స్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. మరోవైపు గురువారం రోజున రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా RC16 సినిమా నుంచి చెర్రీ ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రకటనతో చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఎట్టకేలకు తమ అభిమాన హీరో సినిమా నుంచి అప్డేట్ వస్తుందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version