బేబీ మూన్ ట్రిప్ లో రామ్ చరణ్ ఉపాసన..

-

టాలీవుడ్ స్టార్ కపుల్స్ రామ్ చరణ్ ఉపాసన ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరు బేబీ మూన్ ట్రిప్ ను చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసనా సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ప్రస్తుతం వైరల్ గా మారింది..

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుత అర్ అర్ అర్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడకు చరణ్తో పాటు ఉపాసన కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ అక్కడ ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్ అంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

అయితే ఈ హడావిడిలో కాస్త విరామం తీసుకున్న చరణ్ భార్యతో కలిసి అమెరికా వీధుల్లో సరదాగా షాపింగ్ చేశారు. ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ ఫోటోలు దిగారు.. వీరిద్దరి షాపింగ్ డిన్నర్ కు సంబంధించిన ఫోటోలు ఒక వీడియోగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అంతేకాకుండా ఈ వీడియో కింద బేబీ మూన్ అంటూ టాగ్ కూడా చేశారు.. ఈ వీడియోలో చరణ్ ఉపాసన వెనుక నడుస్తూ భార్య చేస్తున్న షాపింగ్ను ఎంజాయ్ చేయటం అందరిని ఆకట్టుకుంది. ఈ పోస్ట్ చూసిన మెగా అభిమానులు తెగ ఖుషి అవుతుండగా నైస్ కపుల్.. ఆల్ ది బెస్ట్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా మార్చ్ 12న లాస్ ఏంజెల్స్ లో జరగనున్న ఆస్కార్ వేడుకల్లో ఆర్ఆర్అర్ సినిమా కచ్చితంగా ఆస్కార్ అవార్డును గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ అభిమానులు. కేవలం టాలీవుడ్, మెగా అభిమానులు మాత్రమే కాకుండా ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కాగా బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ సౌండ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ కేటగిరీలో ఆస్కార్ ప్రిడిక్షన్లో ఆర్ఆర్అర్ సినిమా నిలిచిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version