నా సినిమాల్లో లిప్ లాక్స్ వద్దని చెబుతా

-

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో వచ్చిన సినిమా హలో గురు ప్రేమకోసమే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో ప్రకాశ్ రాజ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. దసరా సందర్భంగా గురువారం రిలీజైన ఈ సినిమా మిక్సెడ్ టాక్ తో రన్ అవుతుంది. పండుగ సెలవలు ఉన్నాయి కాబట్టి వసూళ్లు బాగానే వస్తున్నాయి.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం యువ హీరోలు ఎక్కువగా ఫాలో అవుతున్న లిప్ లాక్స్ గురించి రామ్ దగ్గర ప్రస్థావించారు మీడియా వారు. అయితే ఇదవరకు సినిమాల్లో దర్శకులు తనని లిప్ లాక్ పెడదామా అడిగారని. సినిమా డిమాండ్ మేరకు లిప్ లాక్ పెట్టాలే తప్ప అవసరం లేకపోయినా లిప్ లాక్ పెట్టడం తనకు నచ్చదని చెప్పాడట. అందుకే మొదటి సినిమా దేవదాస్ లో అది ఇలియానాకి ఒకసారి లిప్ లాక్ పెట్టాడే తప్ప మిగతా ఏ సినిమాలో రామ్ లిప్ లాక్ పెట్టలేదు.

హలో గురు ప్రేమ కోసమే సినిమాలో రామ్, అనుపమల మధ్య రొమాన్స్ బాగుంది. సినిమాలో దాదాపుగా ఇద్దరు లిప్ లాక్ పెట్టేసుకున్నారు అన్నంత దగ్గరగా వస్తారు కాని మిస్ అవుతుంది. మరి లిప్ లాక్స్ విషయంలో రాం మరి పట్టుబట్టి ఉన్నాడు కాబట్టి మాంచి బోల్డ్ స్టోరీతో వస్తే తప్ప అది జరిగేట్టు లేదు.

Read more RELATED
Recommended to you

Latest news