రామ్ బర్త్ డే గిఫ్ట్ .. హెబ్బాతో ‘డిన్చక్…’ వీడియో గ్లింప్స్ అదిరిందిగా..!

-

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఫ్యాన్స్ కి ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ అదిరిపోయింది. తను నటిస్తున్న తాజా చిత్రం నుండి ‘డిన్చక్…’ఒక వీడియో అనే గ్లింప్స్ ని తన పుట్టిన రోజు కానుకగా ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేశాడు. ఈ సాంగ్ టీజర్ మాస్ ఆడియినస్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. రిలీజ్ చేసిన కొద్ది సేపట్లోనే జెట్ స్పీడ్ లో దూసుకు వెళుతుంది.

ఇక నిన్న ప్రకటించిన విధంగా తన లేటెస్ట్ సినిమా రెడ్ నుండి రిలీజ్ చేసిన ‘డిన్చక్…’ అనే సాంగ్ లో రామ్ తో పాటు కుమారి 21 ఫేం హెబ్బా పటేల్ హాట్ గా కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. హెబ్బా పటేల్ ఫస్ట్ టైం చేసిన ఈ ఐటం సాంగ్ తో టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందుకోవడం ఖాయం అని ఇప్పటికే టాక్ మొదలైంది. ఇస్మార్ట్ శంకర్ మాదిరిగా మాస్ సాంగ్స్ తో రామ్ మరోసారి రెచ్చిపోయాడు.

ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ ఫాం లోకి వచ్చిన మణిశర్మ మరోసారి మాస్ సాంగ్స్ ఇచ్చినట్టు ‘డిన్చక్…’ సాంగ్ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్అయిన తడం కి తెలుగులో అఫీషియల్ రీమేక్ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ‘డిన్చక్…’ ఫుల్ సాంగ్ త్వరలో రిలీజ్ చేయనున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version