ఆది, చిరంజీవిపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..మునిగిపోతారు మీరు !

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదిక గా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. వివాదాలను క్రియేట్ చేసి అలా సంచలనాలు రేపుతుంటారు. అయితే.. ఇటీవలే తనపై కామెంట్స్‌ చేసిన హైపర్‌ ఆది, చిరంజీవిలకు చురకలు అంటించారు వర్మ.

జబర్, హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి, రియాల్టీ కి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోందంటూ చిరుపై సెటైర్లు పేల్చారు. పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు వుండరు… రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారని హెచ్చరించారు.. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే అన్నారు వర్మ. ఈ మేరకు వర్మ ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version