నిజామాబాద్‌ ఎంపీగానే కవిత పోటీ !

-

 

మళ్లీ నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేసి గెలుస్తానని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. బిజెపి ఎంపీ అరవింద్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కోరుట్ల పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రధాన పోటీ కాంగ్రెస్ ఏనని కవిత స్పష్టం చేశారు.

తెలంగాణలో 24 గంటల కరెంటు లేదని లోక్సభలో వ్యాఖ్యానించిన బండి సంజయ్… బిజెపి ఆఫీస్ వద్ద కరెంటు తీగల్ని పట్టుకొని చూడాలన్నారు.తెలంగాణలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ లేదని పార్లమెంటులో బండి సంజయ్ ప్రస్తావించండంపై కవిత తీవ్రంగా ఫైర్ అయ్యారు. బీజేపీ కార్యాలయం వద్ద కరెంటు తీగలు పట్టుకొని చూడమని బండికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్​కు ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీయేనని కవిత అన్నారు. రెండు పార్టీల మధ్య సుమారు 20 శాతం ఓట్ల తేడా ఉంటుందని కవిత తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version