టాలీవుడ్ యంగ్ హీరో ల‌క్కీయే ల‌క్కీ.. అనిల్ రావిపూడితో ఛాన్స్‌..!

-

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ఉన్న యంగ్ డైరెక్ట‌ర్ల‌లో అనిల్ రావిపూడి క్రేజీ డైరెక్ట‌ర్‌గా మారిపోయాడు. తొలి సినిమా ప‌టాస్ నుంచి స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌ర‌కు ప్ర‌తి సినిమాతోనూ ఏదో ఒక సెన్షేష‌న్ క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాపై స్కై రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి. క‌థ‌లో ల‌వ్‌, కామెడీ, ఎమోష‌న్‌, యాక్ష‌న్ ఇలా అన్ని స‌మంగా మిక్స్ చేసి క‌థ డిజైన్ చేసుకోవ‌డంలో త్రివిక్ర‌మ్ త‌ర్వాత అనిల్‌కు అనిలే సాటి అన్న ప్ర‌శంస‌లు కూడా వ‌స్తున్నాయి.

సరిలేరు నీకెవ్వ‌రు టీజ‌ర్ చూస్తుంటూనే సినిమాకు హిట్ క‌ళ వ‌చ్చేసిన‌ట్లుంది. తొలిసారిగా సూప‌ర్‌స్టార్‌ను అనిల్ డీల్ చేస్తుండ‌డంతో సినిమా ఎలా ఉంటుందా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది. ఈ సినిమా త‌ర్వాత అనిల్ రావిపూడి ఓ టాలీవుడ్ యంగ్ హీరోతో సినిమా చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. స‌హ‌జంగానే అనిల్ నెక్ట్స్ సినిమా ఏంట‌న్న‌దానిపై అంద‌రిలోనూ ఆస‌క్తి ఉంటుంది.

ఈ క్ర‌మంలోనే అనిల్ నెక్ట్స్ హీరోగా రామ్ పేరు వినిపిస్తోంది. అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ సినిమాను రామ్ తోనే చేయాలనుకున్నాడుగానీ కుదరలేదు. అప్పుడు ఈ ప్లేస్‌లోకి ర‌వితేజ ఎంట‌ర్ అయ్యాడు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన రాజా ది గ్రేట్ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది.

ఇక స‌రిలేరు షూటింగ్ జ‌రుగుతుండ‌గానే అనిల్ మళ్లీ రామ్ ను కలిసి ఒక కథ వినిపించగా వెంటనే రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. రామ్ చేస్తున్న రెడ్ సినిమా షూటింగు పూర్తికాగానే, ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version