ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న సినిమా హలో గురు ప్రేమకోసమే. నక్కిన త్రినాథ రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. రేపు అనగా అక్టోబర్ 18 గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో రామ్ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా దాదాపు ఓకే అనుకుని సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అనుకున్న ప్రవీణ్ సత్తారు సినిమా క్యాన్సిల్ అయ్యింది.. ఆ కారణాలను వెళ్లడించాడు రాం.
గరుడవేగ సినిమా తర్వాత రామ్ ప్రవీణ్ సత్తారుకి పిలిచి మరి అవకాశం ఇచ్చాడు. రామ్ కోసం ఓ అద్భుతమైన కథ సిద్ధం చేయగా అది రామ్ కు నచ్చేసిందట. అయితే ఎటొచ్చి ఆ సినిమాకు బడ్జెట్ సమస్య ఏర్పడిందని తెలుస్తుంది. అనుకున్న కథకు కావాల్సిన బడ్జెట్ భారీగా చెప్పాడట ప్రవీణ్ సత్తారు. అందుకే ఆ సినిమా చేయాలనుకున్న నిర్మాత ఆనంద్ ప్రసాద్ వెనక్కి తగ్గాడు.
ఇక రామ్ సొంత బ్యానర్ సరవంతి మూవీస్ లో కూడా ఈ సినిమా ప్రయత్నాలు జరిగాయి కాని అంత బడ్జెట్ అయితే మనకీ కష్టమే అనేశాడట స్రవంతి రవికిశోర్. అందుకే ఆ ప్రాజెక్ట్ అటకెక్కేసింది. కొంత గ్యాప్ తర్వాత అయినా ప్రవీణ్ తో ఆ సినిమా తప్పకుండా చేస్తా అంటున్నాడు రామ్. మరి అప్పటిదాకా ప్రవీణ్ వెయిట్ చేస్తాడా లేక వేరే హీరోతో చేసేస్తాడా అన్నది చూడాలి.