ఆమెను కారులో వేధించిన దర్శకుడు

-

మీటూ అంటూ హీరోయిన్స్ తమకు జరిగిన లైంగిక వేధింపులను బయట పెడుతున్నారని తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఈ మీటూ క్యాంపెయిన్ సౌత్ పరిశ్రమలకు అంటుకుంది. ఇప్పటికే తమిళ పరిశ్రమలో సింగర్ చిన్మయి ప్రముఖ రచయిత వైరముత్తు వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాలను బయట పెట్టింది. చిన్మయి వ్యాఖ్యలకు కోలీవుడ్ లో అలజడి మొదలైంది.

ఇక ఇప్పుడు ఈ క్యాంపెయిన్ లో భాగంగా ప్రముఖ రచయిత, దర్శకురాలు లీనా మణిమేఖలై దర్శకుడు శశి గణేషన్ తనపై చేసిన వేధింపులను బయట పెట్టింది. తాను వాఖ్యాతగా ఉన్నప్పుడు ఒకసారి శశి గణేషన్ ఇంటర్వ్యూ తీసుకుని వస్తున్నానని.. ఆ టైంలో ఆటోకి వెళ్లాల్సిన తనని ఇంటి దాకా లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారులో తనతో శశిగణేషన్ అసభ్యకరంగా ప్రవర్తించాడని అన్నది లీనా.

Meetoo, Leena-Manimekalei, sensational, comments, Director, Sashi-Ganesan

మీటూ అంటూ ఇండస్ట్రీలో మహిళలు తమకు జరిగిన వేధింపులను బయట పెడుతున్నారు. చూస్తుంటే ఇదో ఉద్యమంగా మారేలా అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్ హీరోయిన్స్ కూడా మీటూ క్యాంపెయిన్ లో పాల్గొంటూ ఉద్యమం తీవ్రతరం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version