టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా “రామారావు ఆన్ డ్యూటీ”. శరత్ మండవ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను s.l.v. సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా… దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించింది చిత్ర బృందం.
రామారావు ఆన్ డ్యూటీ సినిమాను.. జూన్ 17 వ తేదీన అన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ మాస్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ లో మాస్ మహారాజ్ రవితేజ.. ఊర మాస్ గా కనిపిస్తున్నారు. కాగా.. రవితేజ ఇటీవల నటించిన ఖిలాడీ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.
#RamaRaoOnDuty MASSive Release in theatres on June 17 💥💥#RamaRaoOnDutyOnJune17 pic.twitter.com/gXq2znIkhp
— SLV Cinemas (@SLVCinemasOffl) March 23, 2022