అతడి వల్ల రాఘవేంద్రరావు చేతిలో అవమానపడ్డ రంభ..!!

-

రాఘవేంద్రరావు దర్శకత్వంలో జెడి చక్రవర్తి హీరోగా రంభ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం బొంబాయి ప్రియుడు . ఇక ఈ సినిమా కంటే ముందే గులాబీ , దయ్యం, మృగం వంటి సినిమాలు చేసి మంచి గుర్తింపును తెచ్చుకున్న జెడి చక్రవర్తిని హీరోగా తీసుకొని, ఫుల్ ఫార్మ్ లో సినిమాలు తీస్తున్న నటి రంభను హీరోయిన్గా ఓకే చేద్దామనుకొని రాఘవేంద్రరావు ఆలోచించారు. ఇక రాఘవేంద్రరావు సినిమాలంటే ఊళ్లో ఉన్న పళ్ళ తోటలు, పూల తోటలు ఖాళీ అయ్యేదాకా ఆయన వదలరని చెప్పవచ్చు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక చిన్న సంఘటనల వల్ల రంభ గుక్క పెట్టి ఏడ్చిందట. అది కూడా జెడి చక్రవర్తి కారణంగానే ఆమె ఏడ్చిందని సమాచారం..

ఇకపోతే ఒకరోజు షూటింగ్లో పైనుంచి కిందకు బత్తాయి పళ్ళను వేస్తూ దర్శకుడు షూటింగ్ చేస్తున్నారు. ఇదే చిత్రంలో తొలిసారి పైనాపిల్ ని కూడా వాడారు. ఇక సరదాగా నవ్వుతూ ఈసారి బత్తాయి పళ్ళు నీ బొడ్డు మీద వేస్తాను అని , అది అవ్వగానే పుచ్చకాయ కూడా తెప్పించాను , అది కూడా వేస్తానని రాఘవేంద్రరావు సరదాగా అందరిని నవ్వించారు. దానితో రంభ మరియు ఇతర యూనిట్ మెంబర్లు అందరూ కూడా నవ్వుల్లో మునిగిపోయారు. ఇకపోతే అప్పటికే సీరియస్ మూడులోకి వెళ్ళిన రాఘవేంద్రరావుని హీరో , హీరోయిన్ గమనించలేదు. ఇకపోతే అప్పటికే ఒక పాట కోసం దర్శకుడు ముప్పు తిప్పలు పడుతున్నారు. వీరు మాత్రం అలాగే జోకులు పేల్చుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారట.

ఇక రాఘవేంద్రరావు కోపంగా.. నవ్వుతున్న రంభ దగ్గరకు వచ్చి.. ఎంతసేపు టైం తీసుకుంటావో తీసుకో.. మీ నవ్వులు అయ్యేదాకా షూటింగ్ ఆపుతాను.. అయ్యాక చెప్తే మొదలు పెడతానని కోపంగా అన్నారట. ఇక ఆ మాట అనడంతో షూటింగ్ లొకేషన్లోనే రంభ గుక్క పట్టి ఏడ్చింది. అయితే జెడి చక్రవర్తి ఆమెతో ఇలా జోకులు వేయడం వల్లే ఇదంతా జరిగింది. జె.డి.చక్రవర్తితో నేను ఏం తప్పు చేశాను అని నన్ను ఇలా కోప్పడ్డారు అంటూ చెప్పుకొని బాధపడిందట. తర్వాత చిత్ర యూనిట్ ఆమెకు సర్ది చెప్పడంతో తిరిగి ఆ పాట షూటింగ్ మొదలయ్యింది. ఇక ఈ సినిమా ఎంత ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో అర్థం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news