రేపు సాయంత్రం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇండియా – ఆస్ట్రేలియా మద్య మూడో టి20 క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో రెండు టింలు ఈ రోజు సాయంత్రం 5:45 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రెండు టీం అటగాళ్ళను భారీ పోలీసు బందోబస్తూ మద్య నగరంలోని స్టార్ హోటల్ కు తరలించనున్నారు.
ఈ సాయంత్రం ఎయిర్ పోర్ట్ కు రెండు టీంలు రానున్న నేపద్యంలో ఎయిర్ పోర్ట్ లో గట్టి బందోబస్తూ ఏర్పాటు చేశారు అధికారులు. ఈ నేపథ్యంలోనే రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. రేపు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.
మ్యాచ్ నేపథ్యంలో 21 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసామని.. గేట్ నెంబర్ 1 ద్వారా విఐపీ, వివిఐపీ లకోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక్కొక్క పార్కింగ్ లో 1400 ఫోర్ విల్లర్ పట్టేలా ప్రత్యేక పార్కింగ్స్ ఏర్పాటు చేసాం..స్టేడియం చుట్టూ మూడు జంక్షన్స్ ఉన్నాయని వివరించారు. సాయంత్రం నాలుగు గంటల నుండి స్టేడియం వైపు భారీ వాహనాలకు అనుమతి లేదు..మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం..ఏక్ మీనర్ దగ్గర ఎలాంటి పార్కింగ్ కు అనుమతి లేదని పేర్కొన్నారు.