ఊర మాస్ గా డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్

-

టాలీవుడ్ చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూస్తుంటే విజిల్ పొడు అని తప్పక అనాలనిపిస్తుంది. ఊర మాస్ అవతార్ లో రామ్ అదరగొట్టాడు. ఇక ఒక్కో డైలాగ్ ఒక్కో డైమండ్. టఉస్తాద్ ఇస్మార్ట శంకర్.. అలియాస్ డబుల్ ఇస్మార్ట్, మీ వదినేమో కుతుబ్ మినార్, మనమేమో చార్మినార్ట అంటూ రామ్ చెప్పిన డైలాగ్స్ అదుర్స్.

ఇక ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ లోని చిప్ గురించే స్టోరీ ఉంటుందని అర్థమవుతోంది. ఇక చివరలోనే నేను బిగ్ బుల్ అంటే నేనే బిగ్ బుల్ అంటూ రామ్, సంజయ్ దత్ చెప్పే డైలాగ్స్ నవ్వులు తెప్పిస్తాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. సంజయ్ దత్ విలన్ పాత్రలో అలరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version