ఏపీ రైతులకు శుభవార్త..ఏలూరులో ధాన్యం రైతులకు చెక్కుల పంపిణీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. గత రబీ సీజన్ లో ధాన్యం విక్రయించిన… 35374 మంది రైతులకు చెక్కులు ఇచ్చారు. దీనికోసం 674.47 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… గత ప్రభుత్వం రైతులను సంక్షోభంలో నెట్టింది.. ప్రభుత్వ నిబంధనల మేరకు పంట పండించిన అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. రైతులను గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో ప్రత్యక్షంగా చూశామని తెలిపారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన సమయంలో అధికారులతో సమీక్షించిన సమయంలో అనేక అక్రమాలు బయట పడ్డాయని వివరించారు. ఎన్ని కష్టాలు ఎదురైన రైతులకు బకాయిలు చెల్లించాలని నిర్ణయించుకున్నామని… గత ప్రభుత్వం చేసిన అరాచకంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. 674 కోట్లు చెల్లింపులు రైతుల్లో భరోసా కల్పిస్తుంది.. గత ఐదేళ్లలో మీరు పడిన కష్టాలు అన్ని ఇన్ని కాదు..రైతులకు పెద్ద పీట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. కౌలు రైతులను ఆడుకోడానికి డిప్యూటీ సీఎం పవన్ సొంత నిధులు ఖర్చు చేశారు..కౌలు రైతులను ఆదుకోవాలనేది కూటమి ప్రభుత్వ నిర్ణయం అన్నారు.