మీ సార్ పెద్ద గ‌బ్బ‌ర్ సింగ్ అంట నేను ఎవ‌రో తెలుసా..?

-

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన బీమ్లా నాయ‌క్ ప్రీరిలీజ్ ఈవెంట్ అంగ‌రంగ వైభ‌వంగా ఇవాళ యూసూఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో జ‌రిగింది. ఈ సినిమాలో న‌టించిన ద‌గ్గుబాటి రానా మాట్లాడుతూ మీ సార్ పెద్ద గ‌బ్బ‌ర్ సింగ్ అంట నేను ఎవ‌రో తెలుసా అని అన్నారు. ముఖ్యంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే ఏమిటో ఇప్పుడు అర్థం అయింది. మ‌ధ్యాహ్నం నుంచి వ‌చ్చారు.

ముఖ్యంగా చాలా మంది స్టార్స్‌తో న‌టించాను. కానీ హీరో అవ్వ‌డం ఎలా అనే కాన్సెప్ట్ తో చేశారు. నేను ఇప్ప‌టివ‌ర‌కు చేసింది వేరు. ప‌వ‌ర్ స్టార్ అంటే ఎంత స్పెష‌లో ఈ సినిమా చేసిన త‌రువాత నాకు తెలిసింది. ఈ సినిమా న‌టించిన త‌రువాత చాలా నేర్చుకున్నారు. ముఖ్యంగా త్రివిక్ర‌మ్ సార్ చాలా మేధావి. అత‌ను సినిమాల్లోకి రాణిస్తున్నారు. కానీ సైంటిస్ట్ మాదిరిగా టాలెంట్ ఉంద‌న్నారు. ఈ సినిమాలో అంద‌రూ చాలా అద్భుతంగా న‌టించారు. సినిమాల‌కు అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వానికి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news