వక్కతం వంశీ.. రానా.. ఇంట్రెస్టింగ్ అప్డేట్

-

రైటర్ గా ఎన్నో సినిమాలకు కథ అందించి హిట్లు అందుకున్న వక్కంతం వంశీ డైరక్టర్ గా చేసిన మొదటి ప్రయత్నం నా పేరు సూర్య. కాన్సెప్ట్ బాగున్నా బన్ని రేంజ్ సినిమా కాదని ఫలితం నిరాశపరచింది. ఇక ప్రస్తుతం తన సెకండ్ సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు వక్కంతం వంశీ. ఒకసారి డైరక్టర్ గా మారాక కథలు ఇవ్వడం కుదరని పని. అందుకే తన డైరక్షన్ లో సినిమా చేసే హీరో కోసం వేట మొదలుపెట్టాడట.

ఈ క్రమంలో రానా వక్కంతం చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తుంది. రానా దగ్గుబాటి ఎలాంటి సినిమా అయినా సరే అది ప్రతినాయకుడిగా పాత్ర అయినా మెప్పించగలిగిన సత్తా ఉన్న నటుడు. అందుకే ఈసారి వక్కంతం రానాతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. రానా సినిమా అంచనాలు ఉండవు. అందులో అద్భుతాన్ని చూపిస్తే ఇక ఆ సినిమాకు తిరుగు ఉండదు. అందుకే రానాతో కథా చర్చలు చేస్తున్నాడట.

ఇప్పటికే లైన్ ఓకే అవగా ఫుల్ స్క్రిప్ట్ మీద కూర్చుకున్నాడట వక్కంతం వంశీ. చూస్తుంటే రానా.. వక్కతం వంశీల కాంబోలో ఓ క్రేజీ మూవీ రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి నా పేరు సూర్యలో చేసిన తప్పులు రిపీట్ అవకుండా వంశీ డైరక్టర్ గా సెకండ్ మూవీ అయినా హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version