కీచైన్ గొంతులో ఇరుక్కొని తొమ్మిది నెలల చిన్నారి మృతి

-

చిన్నపిల్లలకు ఏ వస్తువులు ఇవ్వకూడదు. ఎప్పుడూ ఎవరూ ఒకరు వాళ్లకు కాపలా ఉండాలి. వాళ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటేనే వాళ్లు పెరిగి పెద్దవుతారు. లేదంటే వాళ్లకు ఏం జరుగుతుందో చెప్పలేం. క్షణాల్లో ఏదైనా కావచ్చు. ఇటువంటి ఘటనే ఏపీలో చోటు చేసుకున్నది.

చిత్తూరు జిల్లా పాకాల సమీపంలోని దామల చెరువుకు చెందదిన శ్రీనివాసులు.. తన తొమ్మిది నెలల కొడుకు లీలాధర్ కు కీచైన్ ఇచ్చాడు. పిల్లాడు ఏడుస్తున్నాడు కదా అని ఆడుకోవడానికి కీచైన్ ఇచ్చాడు కానీ.. అదే అతడి కొడుకు పాలిట యమదూత అవుతుందని ఊహించలేదు. కీచైన్ ఇచ్చి.. తన పని చేసుకుంటున్నాడు శ్రీనివాసులు. ఇక.. లీలాధర్.. ఆ కీచైన్ తో ఆడుకుంటూ ఆడుకుంటూ దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. దాన్ని అలాగే మింగేశాడు. దీంతో అది ఆ పిల్లాడి గొంతులో ఇరుక్కుంది. పిల్లాడికి శ్వాస అందలేదు. ఈ ఘటనను గమనించిన శ్రీనివాసులు పిల్లాడి గొంతులో ఇరుక్కున్న కీచైన్ తీయడానికి ప్రయత్నించాడు. కానీ.. అది బయటికి రాలేదు. దీంతో వెంటనే పిల్లాడిని ఆసుపత్రికి తీసుకొని వెళ్తుండగా.. మార్గమధ్యంలోనే ఆ చిన్నారి మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు.. లేక లేక పుట్టిన కొడుకు… 9 నెలలకే తమని వదిలి వెళ్లి పోయాడని తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న గ్రామస్తులు, చుట్టు పక్కన గ్రామాల వాళ్లు అక్కడికి చేరుకొని కంటతడి పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version