క్రేజీ డైరెక్ట‌ర్ తో రానా తమ్ముడి ఎంట్రీ..

ద‌గ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇప్ప‌టికే వెంక‌టేశ్‌, రాణా ఎంట్రీ ఇచ్చి త‌మ‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రానా అయితే నేష‌న‌ల్ వైడ్ గా బాహుబ‌లితో ఫేమ‌స్ అయ్యాడు. ఈ ఇద్ద‌రూ వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నారు. కాగా ఇప్పుడు మ‌రో హీరో ఎంట్రీ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. ఆయ‌నెవ‌రో కాదండోయ్ రానా త‌మ్ముడు అభిమ‌రామ్‌. అయితే ఇంత‌కు ముందు శ్రీరెడ్డి అభిరామ్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఆయ‌న ఎంట్రీ కాస్త లేట‌యిన‌ట్టు స‌మాచారం.


అయితే ఇప్పుడు ఎంట్రీ ఇవ్వ‌డానికి అభిరామ్ రెడీగా ఉండటంతో.. వంశీ, తరుణ్ భాస్కర్, రవిబాబు లాంటి డైరెక్ట‌ర్ల‌తో కొన్ని ప్రాజెక్టులు సిద్ధం చేయించినా.. అవి పెద్ద‌గా న‌చ్చ‌క‌పోవ‌డంతో.. ఇక క్రేజీ డైరెక్ట‌ర్ తేజ‌తో సినిమా ప్లాన్ చేస్తున్నారు. రానా కూడా తేజ డైరెక్ష‌న్ లో నేనేరాజు నేనే మంత్రి సినిమా చేసి హిట్ అందుకున్నాడు. ఆ న‌మ్మ‌కంతోనే త‌న త‌మ్ముడిని తేజ చేతిలో పెడుతున్నాడ‌ట రానా. అయితే ఈ సినిమాతో ఆర్‌.పి ప‌ట్నాయ‌క్ రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే దీనిపై ప్ర‌క‌ట‌న చేస్తార‌ని స‌మాచారం.