గేమ్ ఛేంజర్ డైరెక్టర్ కుమార్తె పెళ్లిలో రణ్వీర్ సింగ్ డ్యాన్స్.. వీడియో వైరల్

-

ప్రముఖ దర్శకుడు శంకర్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం సోమవారం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ కార్తీక్‌తో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత మంగళవారం రోజున సినీ ప్రముఖుల కోసం చెన్నైలో రిసెప్షన్ ఏ ర్పాటు చేయగా.. దక్షిణాదితోపాటు బాలీవుడ్‌కు చెందిన నటులు దీనికి హాజరయ్యారు.

చిరంజీవి-సురేఖ దంపతులు, మోహన్‌లాల్‌, అట్లీ, విజయ్‌ సేతుపతి, జాన్వీకపూర్‌, వెట్రీమారన్‌, లోకేశ్‌ కనగరాజ్‌, అనిరుధ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రెహమాన్‌, రామ్‌చరణ్‌ హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రణ్‌వీర్‌ సింగ్‌ డ్యాన్స్‌తో అలరించారు. శంకర్‌ చిన్న కుమార్తె ఆదితితో కలిసి ‘లుంగీ డ్యాన్స్‌’, ‘వాతి కమింగ్‌’ పాటలకు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌ అయ్యాయి. వైద్యురాలైన ఐశ్వర్యకు ఇది రెండో వివాహం. 2021లో క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌తో ఆమె వివాహం జరగగా.. పరస్పర అంగీకారంతో వారు విడాకులు తీసుకున్నారు. ఇక తరుణ్‌ కార్తీక్‌.. శంకర్‌ సినిమాలకూ సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version