సోషల్‌మీడియాలోని నకిలీ ఫాలోవర్స్ కుంభకోణంలో తన ప్రమేయం లేదని ర్యాపర్ బాద్షా స్పష్టం చేశాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముంబయి పోలీసులకు తాను సహకరించానని, తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పాడు.ఇటీవలే విడుదలైన బాద్షా మ్యూజిక్ ఆల్బమ్‌కు నకిలీ లైక్‌లు, ఫాలోవర్స్‌తో ప్రచారం చేశారనే ఆరోపణలపై తనను క్రైమ్ ఇంటిలిజెన్స్ విభాగం (సీఐయూ) శుక్రవారం, దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించినట్లు చెప్పాడీ ర్యాపర్. శనివారం మరోసారి విచారణకు హాజరయ్యానని అన్నాడు.నకిలీ ఫాలోవర్స్ కేసులో బాద్షాను ఆదివారం మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 20 మందిని ముంబయి పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది.
నాకు అందిన సమన్ల ప్రకారం ముంబయి పోలీసులతో మాట్లాడాను. సోషల్‌మీడియాలో నకిలీ ఫాలోవర్స్ కేసు విచారణలో భాగంగా పోలీసులకు సహకరించాను. నాపై వస్తున్న చాలా ఆరోపణల్లో నిజం లేదు. అలాంటి వాటిలో ఎప్పుడూ చేయదల్చుకోలేదు. నాపై అలాంటి ప్రచారాలు చేసేవారిని అస్సలు క్షమించను. ఈ కేసు చట్టప్రకారం దర్యాప్తు చేస్తున్నారు. అధికారులపై నాకు పూర్తి నమ్మకం ఉంది అని ర్యాపర్ బాద్షా అన్నారు.