రష్మిక బర్త్ డే స్పెషల్.. ఆడాళ్లు మీకు జోహార్లు ఫస్ట్ లుక్ రిలీజ్..!

Join Our Community
follow manalokam on social media

కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో సూపర్ ఫాం లో ఉంది. ఛలో నుండి సరిలేరు నీకెవ్వరు వరకు తీసిన సినిమాలన్ని ప్రేక్షకులను మెప్పించడంతో అమ్మడికి స్టార్ క్రేజ్ దక్కింది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాటుగా శర్వానంద్ ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలో కూడా నటిస్తుంది రష్మిక. ఈరోజు రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా నుండి రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

యెల్లో కలర్ శారీలో తన క్యూట్ లుక్స్ తో రష్మిక తన ఫ్యాన్స్ ను అలరిస్తుంది. కిశోర్ తిరుమల డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. జాను, శ్రీకారం సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైన శర్వానంద్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. రష్మిక కూడా తెలుగులో సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ అదరగొడుతుంది. ఈమధ్యనే కోలీవుడ్ లో కార్తీ సరసన సుల్తాన్ సినిమాలో నటించింది అమ్మడు. తమిళంలో కూడా రష్మికకు వరుస అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగులో అలరించినట్టుగానే తమిళ ఆడియెన్స్ ను కూడా తన మాయలో పడేయాలని చూస్తుంది అమ్మడు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...