Rashmika Mandanna : రష్మిక మీద డీప్ ఫేక్ కేసు వెనుక గుంటూరు వాసి !

-

Rashmika Mandanna  : రష్మిక మీద డీప్ ఫేక్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. రష్మిక మీద డీప్ ఫేక్ వీడియో చేసిన గుంటూరు వాసి అరెస్ట్ అయ్యాడు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన ఈమని నవీన్ (24) చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

Rashmika Mandanna deep fake case Delhi Police arrests mastermind from Andhra Pradesh

రష్మిక అభిమాని అయిన నవీన్ ఆమెకు సంబంధించిన ఇన్స్టాగ్రాం పేజీ నడుపుతుండగా ఫాలోవర్లు తక్కువ ఉన్నారని ఏఐ ( ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ వాడి రష్మిక మీద డీప్ ఫేక్ వీడియో తయారు చేసి పెట్టాడు. వీడియో వైరల్‌గా మారి దుమారం రేగడంతో పోస్టులు అన్నీ డిలీట్ చేసి పేజీ పేరు కూడా మార్చేశాడు. ఐపీ అడ్రస్ ఆధారంగా సంక్రాంతికి ఇంటికి వచ్చిన సమయంలో అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసును పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news