కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ నుంచి తన సినీ కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె బాలీవుడ్ సినిమాలతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేయడానికి పయనమయింది అని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఏకంగా షారుఖ్ ఖాన్ తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
అటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా త్వరలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా రష్మికను తీసుకునే అవకాశం ఉందని ఇప్పటికే చర్చలు కూడా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదటగా ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు రష్మిక పేరు తెరపైకి వచ్చింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ తరుణంలోనే తాజాగా బ్లాక్ సారీ లో రష్మిక అందాలు ఆరబోసింది.ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.