KCRను గద్దె దించే వరకు నిద్రపోను: విజయశాంతి

-

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి మరియు భారత రాష్ట్ర సమితి పార్టీలు రెండు ఒకటయ్యాయని కాంగ్రెస్ నేత విజయశాంతి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ ను గద్దదించే వరకు తాను నిద్ర పోవాలని… స్పష్టం చేశారు. తాజాగా విజయశాంతి మీడియాతో మాట్లాడారు. పదేళ్లలో సీఎం కేసీఆర్ ప్రజలకు ఏం చేశారని ఈ సందర్భంగా నిలదీశారు విజయశాంతి.

vijayashanthi on ts assembly elections

 

ఎందుకు ఓటేయాలని ప్రజలు అడుగుతున్నారు… దానికి సీఎం కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని మండిపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు తిన్నందుకు సీఎం కేసీఆర్ కు ఓటు వేయాలా ? ఓటు అడగడానికి సిగ్గుందా ? అని విజయ శాంతి నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ మరియు కేంద్ర బిజెపి పార్టీ కుమ్మక్కు అయ్యాయని… అందుకే భారత రాష్ట్ర సమితి పార్టీ నేతల ఇళ్లల్లో ఐటీ రైట్స్ జరగడంలేదని ఆగ్రహించారు. ఈ రెండు పార్టీల మధ్య లోపకాయి ఒప్పందం జరిగిందని కూడా సంచలన ఆరోపణలు చేశారు రాములమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version