SSMB 28: స్పెషల్ సాంగ్‌లో రష్మిక?

-

అతడు, ఖలేజా చిత్రాలతో టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా నిలిచారు నటుడు మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న మూడో చిత్రం #SSMB28 (వర్కింగ్‌ టైటిల్‌) ప్రకటన వెలువడటమే ఆలస్యం సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.

వీరి కాంబినేషన్ లో రానున్న పాన్ ఇండియా చిత్రం పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ఇందులోని ఓ నెగిటివ్ పాత్ర కోసం ఇటీవల ‘పొన్నియన్ సెల్వన్’ లో నటించి మెప్పించిన మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీని సంప్రదించారట.

అయితే మహేష్ బాబు SSMB28 గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్ గా పూజ హెగ్డే, మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. ఇందులో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల, స్పెషల్ సాంగ్ కోసం రష్మిక మందన నటించనున్నట్లు నెట్టింట చర్చ జరుగుతుంది. డిసెంబర్ మొదటి వారంలో షూట్ స్టార్ట్ చేసి, 2023 ఆగస్టులో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version