ప్రముఖ నటి రష్మిక మందన సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. అనేక సినిమాలలో నటిస్తూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తూ మంచి గుర్తింపు అందుకుంటుంది. తాజాగా నటి రష్మిక మందన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో తనకు సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకుంటూ సంచలన కామెంట్లు చేశారు. జీవితంలో ఏదీ కూడా శాశ్వతం కాదు ఇది అర్థం చేసుకొని ఉన్నట్లయితే జీవితంలో సంతోషంగా ఉండవచ్చని రష్మిక అన్నారు.

ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది అప్పుడు నీకు నచ్చిన విధంగా మీ జీవితం మారుతుందని రష్మిక అన్నారు. నేను కష్టాల్లో ఉన్న సమయంలో నా కుటుంబ సభ్యులు స్నేహితులు నాకు అండగా ఉండడం నేను అదృష్టంగా భావిస్తాను. నిజానికి కూర్గ్ లాంటి చిన్న ప్రాంతం నుంచి వచ్చిన నేను ఇంత గొప్ప నటిని అవుతానని కలలో కూడా అనుకోలేదని రష్మిక వెల్లడించారు. నా సక్సెస్ కి కారణం నా అభిమానులేనంటూ రష్మిక హాట్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ భామ షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.