పూజ హెగ్డే, రష్మిక మందన్నలని మించిపోయిన రాశీఖన్నా …!

-

మద్రాస్ కేఫ్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టి రాశీఖన్నా మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత వరసగా సినిమా చేస్తూనే ఉంది. టాలీవుడ్.. కోలీవుడ్..బాలీవుడ్.. ఇలా సౌత్ అండ్ నార్త్ లో రాశి ఖన్నా స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. ఇక ఇప్పటి వరకు తమిళం, హిందీకంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది రాశిఖన్నా. సక్సస్ చాలానే తన ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి ఫాం లో ఉన్న ఈ బ్యూటి రీసెంట్ గా సాయి ధరం తేజ్ తో ప్రతిరోజు పండగే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

 

అయితే ప్రస్తుతం రాశీఖన్నా టాలీవుడ్ కంటే కోలీవుడ్ లో ఎక్కువ సినిమాలు కమిటయింది. దాదాపు నాలుగు మంచి ప్రాజెక్ట్స్ అమ్మడి చేతిలో ఉన్నాయి. ఇన్ని సినిమాలు ఇప్పుడు పూజా హెగ్డే, కన్నడ బ్యూటి రష్మిక మందన్న ల చేతిలో కూడా లేవనే చెప్పాలి. కార్తీక్ జి క్రిష్ తెరకెక్కించబోయో షహితాన్ కా బచ్చ సినిమా ఈ పాటికే షూటింగ్ కంప్లీట్ కావాల్సింది. కాని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా కాస్త ఆలస్యంగా మొదలవనుందట.

ఇక తాజాగా మూడు ప్రాజెక్ట్స్ ని దక్కించుకుంది. ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో రాబోతున్న అరన్మానై 3 లో నటిస్తుంది. అలాగే సింగం సిరీస్ తో సూర్య కి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన హరి దర్శకత్వంలో రూపొందే సినిమాలో అవకాశం అందుకుంది. ఇక ఈ సినిమాలో సూర్య సరసన నటిస్తుంది. అంతేకాదు ఈ సినిమా సింగ్ సిరీస్ లో వస్తుండటం విశేషం. ఇక ఈ సినిమా తర్వాత పా.విజయ్ దర్శకత్వంలో మేథావి అనే సినిమాలోను నటిస్తుంది. ఇలా మొత్తం రాశీఖన్నా చేతిలో నాలుగు తమిళ సినిమాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version