బిగ్​బాస్-7లో ఊహించని ఎలిమినేషన్.. హౌస్​ నుంచి రతికా రోజ్ ఔట్

-

బిగ్‌బాస్‌ సీజన్‌-7 ఉల్టా పుల్టా అనే ట్యాగ్​లైన్​తో ఈసారి చాలా ఇంట్రెస్టింగ్​గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సీజన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే నాలుగు వారాలు ముగిసింది. ఈ వారం హౌజ్ నుంచి ఎవరూ ఊహించని ఎలిమినేషన్ జరిగింది. బిగ్​బాస్- సీజన్-7 నుంచి ఈ వారం రతిక రోజ్‌ ఎలిమినేట్‌ అయింది. నాలుగో వారం ప్రియాంక, రతిక రోజ్‌, ప్రిన్స్‌ యావర్‌, శుభశ్రీ, గౌతమ్‌కృష్ణ, టేస్టీ తేజలు నామినేషన్స్‌లో ఉండగా, టేస్టీ తేజ, రతిక మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో చివరిగా రతిక ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించగానే ఆమె ఒక్క సారిగా షాక్‌ అయింది.

కన్నీటిని ఆపుకొంటూనే హౌస్‌ నుంచి వేదికపైకి వచ్చింది. ‘రతిక హౌస్‌ లోపలికి పగిలిన హృదయంతో వెళ్లావు. ఇప్పుడు ఫుల్‌ హార్ట్‌తో వచ్చావా’ అని నాగార్జున ప్రశ్నించగా, ‘లేదు. ఇంత తొందరగా రావాలనిపించలేదు. ఇంకా ఆడితే బాగుండనిపించింది. అంతా కలలా ఉంది’ అంటూ సమాధానం ఇచ్చింది. అయితే రతిక ఎలిమినేషన్​ను కంటెస్టెంట్లే కాదు ప్రేక్షకులు కూడా ఊహించలేదు. ప్రశాంత్‌, యావర్‌, రతికల మధ్య హౌస్‌లో కాస్త ఆసక్తికరమైన ట్రాకే నడిచింది. ఈ ట్రాక్​లే హౌస్​లో ఆసక్తిగా ఉంటాయని భావించిన ప్రేక్షకులు రతిక ఇంకొన్ని రోజులు ఉంటుందనుకున్నారు. కానీ ఇప్పుడు రతిక ఎలిమినేషన్​తో ఈసారి ఉల్టా పుల్టా కరెక్టుగానే ట్యాగ్ లైన్ పెట్టారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు రతిక ఎలిమినేషన్​తో మా హృదయం బద్ధలైందంటూ కొందరు యువకులు కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news