అమర్ అక్బర్ ఆంటోనీ టీజర్

-

రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ. గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ ట్రిపుల్ రోల్ లో కనిపిస్తాడని అంటున్నారు. ట్రుపుల్ రోల్స్ లో కనిపిస్తాడా.. లేక ట్రిపుల్ క్యారక్టర్స్ లో ఒక్కడే మారుతాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా నుండి పివోట్ అంటూ ఓ వీడియోని రిలీజ్ చేశారు.

ఈ పివోట్ లో ముగ్గురు మూడు విభాలుగా సైలెంట్ లుక్ లో కనిపిస్తారు. అంతేకాదు మూడు పాత్రలలో దగ్గర పోలికలు ఉన్నాయి. ముగ్గురు సీరియస్ గా కనిపించడం మాత్రం గమనించవచ్చు. పివోట్ రవితేజ ఫ్యాన్స్ కు నచ్చినా ఏదైనా డైలాగ్ వదిలి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఈ ఇయర్ దసరా బరిలో దిగాలనుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version